Header Banner

ఇదేమి ట్విస్ట్ రా నాయనా! సినిమా కన్నా డ్రామాటిక్.. MMTS అత్యాచారం కేసులో సంచలనం!

  Fri Apr 18, 2025 17:45        Others

తెలంగాణలో ఇటీవల సంచలనం సృష్టించిన MMTS రైలులో యువతిపై అత్యాచారయత్నం కేసులో విపరీత మలుపు తిరిగింది. మొదట రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ యువకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు చెప్పిన యువతి, రైలు నుంచి దూకి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే సీసీ కెమెరాలు, సాక్షుల ఆధారాల ద్వారా విచారణ చేస్తే, యువతి చెప్పిన కథనంలో అనేక సందేహాలు తలెత్తాయి. దాదాపు 250 సీసీ కెమెరా ఫుటేజీలు, 100 మంది సాక్షులను పరిశీలించినా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు యువతిని మళ్లీ విచారించారు.

 

తాజాగా యువతి నిజాన్ని ఒప్పుకోవడంతో షాక్‌కు గురయ్యారు పోలీసులు. ఫోన్ రిపేర్ తర్వాత తిరుగు ప్రయాణంలో, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి గాయపడినట్లు ఆమె పేర్కొంది. అయినా ఆ విషయాన్ని ఎవరికైనా చెప్పితే తిడతారని భయంతో, తనపై ఒక యువకుడు లైంగిక దాడి చేశాడని అబద్దం చెప్పినట్లు వెల్లడించింది. ఈ నిజం బయటకు రాగానే ప్రజల్లో ఆగ్రహం చెలరేగింది. అరెస్టయిన యువకుడిపై న్యాయం జరగాలంటూ, ఆడవారు తప్పు చేస్తే ఎంతవరకు సహించాలి అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమయ్యాయి. ఈ ఘటన భద్రత, న్యాయ వ్యవస్థలపై చర్చను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!

చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!

ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!

టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #MMTSCase #TruthRevealed #FalseAccusation #JusticeForMen #TelanganaNews #ViralTwist